News
వైసీపీకి బోరెడ్డి లక్ష్మీ రెడ్డి రాజీనామా
వైసీపీకి, జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు న్యాయవాది బోరెడ్డి లక్ష్మీ రెడ్డి ప్రకటించారు. గురువారం పట్టణంలోని తన స్వగృహంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ నా యకత్వంలోని వైసీపీలో డబ్బున్న వారికి, దౌర్జన్య కారులకు, అవినీతిపరులకు మాత్రమే విలువ ఉందని, మంచితనానికి, పార్టీ అభివృద్ధికి పాటుపడే వారికి స్థానం లేదని అన్నారు. తాను గతేడాది జూలై 1న బీజేపీకి రాజీనామా చేసి హైదరాబాదుని లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో పార్టీలో చేరానన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వ హించానని, పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. కానీ ఇటీవల ఆళ్లగడ్డ నియోజకవర్గం పార్టీ ప్లీనరీ సమావేశాలకు, పార్టీ బలోపేతానికి చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో తనను పిలవకుండా చిన్న చూపు చూసినందులకు నిరసనగా పార్టీకి, ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








